న్యూజిలాండ్ తో జరుగుతోన్న రెండో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 166 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ కరుణరత్నే-89; చండిమల్-37; నిషాన్ మధుశ్క-19 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. నలుగురు బ్యాట్స్ మెన్ (కుశాల్ మెండీస్, ధనుంజయ డిసిల్వా, రజిత, అషిత ఫెర్నాండో) డకౌట్ అయ్యారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, మైఖేల్ బ్రేస్ వెల్ చెరో మూడు; సౌతీ, డాగ్ బ్రేస్ వెల్; తిక్నర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగుల ఆధిక్యం ఆతిథ్య జట్టు సాధించింది.
ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఓపెనర్లు ఒషాడ ఫెర్నాండో -5; కరుణరత్నే-51 పరుగులు చేసి ఔట్ కాగా, కుశాల్ మెండీస్-50; మాథ్యూస్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. సౌతీ, డాగ్ బ్రేస్ వెల్ చెరో వికెట్ సాధించారు.