Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్Asia Cup-Super-4:  ఆఫ్ఘన్ పై లంక విజయం

Asia Cup-Super-4:  ఆఫ్ఘన్ పై లంక విజయం

ఆసియా కప్ క్రికెట్-2022, సూపర్ 4లో జరిగిన తొలి మ్యాచ్ లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. లీగ్ దశ ఆరంభ మ్యాచ్ లో లంకపై ఆఫ్ఘన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి నేటి విజయంతో లంక బదులు తీర్చుకుంది. ఆఫ్ఘన్ బ్యాట్స్ మ్యాన్ రహ్మతుల్లా గుర్జాబ్ 45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆఫ్ఘన్ విసిరిన 176 పరుగుల విజయ లక్ష్యాన్ని శ్రీలంక మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి సాధించింది.

షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదటి వికెట్ కు ఆఫ్ఘన్ 46 పరుగులు (హజ్రతుల్లా జజాయ్-13) చేసింది. రెండో వికెట్ కు గుర్జాబ్- ఇబ్రహీం లు 93 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇబ్రహీం 40 పరుగులు చేశాడు, నజీబుల్లా 10 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో17 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక రెండు; తీక్షణ, ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత లంక తొలి వికెట్ కు 62 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్-36; పాథుమ్ నిశాంక-35; గుణతిలక-33; భానుక రాకపక్ష-31 పరుగులతో సమిష్టిగా రాణించారు. చివర్లో హసరంగ 9 బంతుల్లో మూడు ఫోర్లతో 16 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి నాటౌట్ గా నిలిచాడు. ఆఫ్ఘన్ బౌలర్లతో ముజీబుర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్ చెరో రెండు; రషీద్ ఖాన్, నబీ చెరో వికెట్ పడగొట్టారు.

84 పరుగులతో రాణించిన ఆఫ్ఘన్  ఆటగాడు రహ్మతుల్లా గుర్జాబ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : Asia Cup-2022: సూపర్ 4కు ఇండియా

RELATED ARTICLES

Most Popular

న్యూస్