Sunday, January 19, 2025
Homeసినిమాఎటు చూసినా శ్రీలీలనే కనిపిస్తోందే! 

ఎటు చూసినా శ్రీలీలనే కనిపిస్తోందే! 

తెలుగు తెరపై అందమైన కథానాయికల సందడి చాలా కాలం నుంచే కొనసాగుతూ వస్తోంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల సంగతి అలా ఉంచితే, ఒక దశలో జయసుధ .. జయప్రద .. శ్రీదేవి జోరు కొనసాగుతూ వచ్చింది. హీరో ఎవరైనా ఈ ముగ్గురు హీరోయిన్స్ లో ఎవరో ఒకరు వారి జోడీ కట్టేవారు. ఆ తరువాత కాలంలో కొంతమంది హీరోయిన్స్ స్టార్స్ రేసులో ఉన్నప్పటికీ, విజయశాంతి .. రాధ .. భానుప్రియ హవా కొనసాగింది. నటన పరంగా .. డాన్స్ పరంగా కూడా ఈ ముగ్గురూ మంచి మార్కులు కొట్టేశారు.

ఈ ముగ్గురు హీరోయిన్స్ సుదీర్ఘకలం పాటు తన కెరియర్ ను కొనసాగించారు. ఆ తరువాత సౌందర్య .. రోజా .. రంభ సందడి మొదలైంది. నటన ప్రధానమైన పాత్రల్లో సౌందర్య .. గ్లామరస్ రోల్స్ లో రోజా – రంభ దూసుకుపోయారు. మిగతా హీరోయిన్స్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ తట్టుకుని ఎక్కువ కాలం నిలబడ్డారు. స్టార్ హీరోల జోడీగా ఎక్కువసార్లు కనిపిస్తూ, వీలైనన్ని విజయాలను దక్కించుకున్నారు. ఆ తరువాతనే కాజల్ .. తమన్నా .. త్రిష జోరు కొనసాగింది.

ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా ఎవరి ప్రత్యేకతను వారు కనబరిచారు. వాళ్ల హవా చివరిదశకి చేరుకుంటూ ఉండగా, పూజ హెగ్డే .. రష్మిక .. కీర్తి సురేశ్ అందుకున్నారు. వీళ్లు తెలుగుతో పాటు ఇతర భాషల్లోను తమ స్పీడ్ చూపిస్తున్నారు. వీళ్ల తరువాత లైన్ లో మాత్రం ముగ్గురు హీరోయిన్స్ కాకుండా ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నారు. ఆ ఒక్కరి పేరే శ్రీలీల. ఇప్పుడు ఏ సినిమాలో చూసినా .. ఏ సినిమా ఫంక్షన్ లో చూసినా శ్రీలీలనే కనిపిస్తోంది. ఆమెతో పాటు బరిలో ఉన్న కృతి శెట్టి జోరు కూడా తగ్గడంతో, ప్రస్తుతం శ్రీలీల మాత్రమే ఇక్కడ రాజ్యమేలుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్