Saturday, January 18, 2025
Homeసినిమా నాగ‌చైత‌న్య స‌ర‌స‌న శ్రీలీల లేదా సాక్షి?

 నాగ‌చైత‌న్య స‌ర‌స‌న శ్రీలీల లేదా సాక్షి?

who is female lead?: యువ స‌మ్రాట్ నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రానికి మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన థ్యాంక్యూ మూవీ జులై 8న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. అయితే.. ఈ సినిమా త‌ర్వాత నాగ‌చైత‌న్య‌.. త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భుతో సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం కూడా జ‌రిగింది. తెలుగు, త‌మిళ్ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

అయితే.. ఈ సినిమాని ప్ర‌క‌టించి చాలా రోజులు అయ్యింది కానీ.. ఆత‌ర్వాత నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. తాజా వార్త ఏంటంటే.. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. జులై లేదా ఆగ‌ష్టు నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. 90 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమా క‌థ చాలా బాగా న‌చ్చ‌డంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని చైత‌న్య ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నాడు.

ఇక హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే… పెళ్లిసంద‌డి సినిమాలో న‌టించిన శ్రీలీల కానీ.. ఏజెంట్ సినిమాలో న‌టిస్తున్న సాక్షి వైద్య కానీ న‌టించే ఛాన్స్ ఉంది. వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌ర్ని ఫైన‌ల్ చేయాలి అనుకుంటున్నారు. త్వ‌ర‌లోనే హీరోయిన్ ఎవ‌రు అనేది ఫైన‌ల్ చేసిన త‌ర్వాత ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్