Sunday, January 19, 2025
Homeసినిమాపవన్, తేజ్ మధ్యలో శ్రీలీల?

పవన్, తేజ్ మధ్యలో శ్రీలీల?

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది.  సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి ఇది రీమేక్. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. అయితే.. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడం వెనుక ఉన్నది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ప్రాజెక్ట్ సెట్ చేయడమే కాకుండా.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి పక్కా కమర్షియల్ గా మార్చేశారట.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నేలకు దిగి వచ్చిన దేవుడి పాత్ర పోషిస్తున్నారు కానీ.. స్క్రిప్ట్ తయారు చేసింది త్రివిక్రమ్ కాబట్టి… ఎంత కమర్షియల్ చేయాలో అంతా చేశారు. పనిలో పనిగా పవన్, తేజ్ మధ్య ఓ స్పెషల్ సాంగ్ కూడా డిజైన్ చేశారట. ఈ స్పెషల్ సాంగ్ లో ఈ మామా అల్లుళ్ల‌ మధ్యన డ్యాన్స్ చేయడానికి ఎవర్ని తీసుకోవాలన్న ఆలోచనలు సాగుతున్నాయి. ఈ విషయంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తోంది. పెళ్లిసందడి చిత్రంతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

తొలి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకుంది. ఇటీవల ధమాకా చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించింది. ముఖ్యంగా డ్యాన్స్ అదరగొట్టేసింది. అందుకనే పవన్, తేజ్ మధ్యలో శ్రీలీల అయితే.. అదిరిపోతుంది అని మేకర్స్ ఆలోచన. అందుకనే ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే కనుక సెట్ అయితే.. ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ రావడం ఖాయం. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 25 రోజులు డేట్స్ ఇచ్చారు. చకచకా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయాలి అనుకుంటున్నారు.

Also Read :  సాయితేజ్ కోసం పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్