Jagadguru Yatiraj Charya : పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు యతిరాజ్ చార్య స్వామి 50 ఏళ్ల క్రితం కాశీ నుండి వచ్చి హైద్రబాద్ చాంద్రాయణగుట్ట లోని పురాతన జగ్గనాధ ఆలయంలో స్వామికి సేవాలందిస్తూ ఉన్నారు. ఆలయ ప్రాంగణంలోనే తన జీవనం కొనసాగించిన స్వామి ఆదివారం సాయంత్రం అస్వస్థకు గురై స్థానిక బేగంబజార్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి ప్రాధమిక చికిత్స కొరకై వెళ్లారు. చికిత్స అందిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పీఠాధిపతులవారు సమయం దొరికినప్పుడల్లా కాశీకి తన శిష్యుల వద్దకు వెళ్లేవారు. పీఠాధిపతులవారు పరమవదించిన విషయం తన శిష్యులకు తెలియగానే, వెంటనే స్పందించి ఇతర శిష్యులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఈక్రోజు (సోమవారం) శిష్యుల బృందం విమానంలో హైదరాబాదుకు రానున్నారు. కాగా అంతక్రియలు ఎక్కడ చేసేది మాత్రం శిష్యుల కమిటీ,ప్రతినిధులు నిర్ణయిస్తారు, అప్పటి వరకు పీఠాధిపతి పార్ధీవదేహం జగ్గనాధ ఆలయంలో భక్తుల దర్శనార్థం ఉంచారు,