Sunday, January 19, 2025
Homeసినిమాప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అవుతున్న శ్రీదేవి - శోభన్ బాబు

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అవుతున్న శ్రీదేవి – శోభన్ బాబు

సంతోష్ శోభన్ – గౌరీ కిషన్ జంటగా ‘శ్రీదేవి – శోభన్ బాబు సినిమా రూపొందింది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల తన సొంత బ్యానర్ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్’ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో తెలుగు తెరకి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ .. బంజారాహిల్స్ లోని ‘రాడిసన్ బ్లూ ప్లాజా’లో రేపు  నిర్వహిస్తున్నారు. రేపు మధ్యాహ్నాం 3 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది.  అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఒకప్పుడు శ్రీదేవి – శోభన్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అప్పట్లో గ్రామీణ ప్రాంతాలకి చెందిన యువతీ యువకులు అలాగే ఫీలయ్యేవారు.

అలాంటి ఒక గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది. టైటిల్ దగ్గర నుంచే ఈ సినిమా  అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఆ  కాలంలో నడిచే ఈ కథపై సహజంగానే కుతూహలం మొదలైంది. యూత్ కీ .. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఈ కథతో వస్తున్న ఈ సినిమా  హిట్ కొడుతుందేమో చూడాలి. ఇక రేపు సాయంత్రమే ‘సార్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్