Sunday, January 19, 2025
Homeసినిమాపెదకాపు-1 ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల

పెదకాపు-1 ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల

శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న న్యూఏజ్ ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘పెదకాపు-1’. ఓ సామాన్యుడి సంతకం అనేది ట్యాగ్ లైన్. ఇందులో విరాట్ కర్ణ , ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఆగష్టు 18న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘చనువుగా చూసిన’ ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసిన మేకర్స్ మ్యూజికల్ జర్నీని ఆరంభించారు. మిక్కీ జె మేయర్ ప్లజంట్  మెలోడీని కంపోజ్ చేసారు. ప్రోమో అందరినీ అలరిస్తుంది. ఆర్కెస్ట్రేషన్, వాయిస్, లిరిక్స్ రొమాంటిక్ నంబర్‌కు తగ్గట్టుగా వున్నాయి. పూర్తి పాటను జూలై 27న విడుదల చేయనున్నారు. అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. టీజర్‌లో శ్రీకాంత్ అడ్డాల కథ-కథనంలో తన ప్రతిభను చూపించారు. టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. మరి.. సెన్సిబుల్ చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల ఈ పొలిటికల్ మూవీతో ఎంత వరకు ఆకట్టుకుంటారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్