Sunday, September 8, 2024
HomeTrending Newsటిడిపివి పనికిమాలిన ఆరోపణలు

టిడిపివి పనికిమాలిన ఆరోపణలు

Viveka Murder Case : వివేకా హత్యపై తెలుగుదేశం పార్టీ నిరాధార, పనికిమాలిన ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.  ఈ విషయంలో అత్యున్నత సంస్థ సిబిఐ దర్యాప్తు కొనసాగుతోందాని, దాన్ని తాము కూడా ఆహ్వానించామని, కానీ దర్యాప్తులో వాస్తవాలను తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. దర్యాప్తులో తాము ఎందుకు కల్పించుకుంటామని ప్రశ్నించారు. తాడేపల్లి లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అయన మాట్లాడిన ముఖ్యాంశాలు….

  • రాష్ట్రంలో ఒక ప్రజా పరిపాలన కొనసాగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు
  • కరకట్టపై అక్రమంగా నివాసం ఉంటూ దాన్ని కుట్ర కోటగా మార్చాడు
  • ఆ కోటలో కుట్రదారులు అనునిత్యం కుట్రలు చేస్తున్నారు
  • సీబీఐ తోక కత్తిరిస్తాం… రాష్ట్రంలోకి రానివ్వము అన్న మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు
  • రామ్ సింగ్ పై ప్రభుత్వం కేసు పెట్టించింది అని మాట్లాడుతున్నారు
  • గజ్జల ఉదయ్ కుమార్ 27 జనవరిలో పిర్యాదు చేశారు
  • కేసు ఫైల్ కాలేదు అని రెండోసారి ఈనెల 17వ తేదీ పిర్యాదు ఇచ్చారు
  • కోర్ట్ ఆదేశాలతో కేసు నమోదైంది..దానిపై మీరు మాట్లాడటం ధిక్కరణ కాదా
  • రంగా, పింగళి దశరథ్ లాంటి వారిని చంపించిన ఘనత మీది
  • చనిపోయిన వ్యక్తి మా నాయకుడి చిన్నాన్న…
  • దానిని మీ రాజకీయ ప్రయోజనాలను వాడుకుంటున్నారు…ఎందుకింత మీకు అత్యుత్సాహం…
  • యదార్థాలు ఏమిటి అని అడిగే హక్కు మాకుంది…అవినాష్ మా ఎంపీ
  • వాస్తవాలు బయటకు రావాలని మేము కోరుకుంటున్నాం…
  • ఎవరినో నిందించాల్సిన అవసరం మాకు లేదు
  • మీరేది చేస్తే మేమూ అదే చేస్తాం అనుకోవడం మీ భ్రమ
  • సజ్జల, మేము మాకున్న అనుమానాలు అడుగుతున్నాం
  • ఎందుకు ఆ లేఖ సాయంత్రం వరకూ బయటకు రాలేదు అని అడుగుతున్నాం
  • ఉదయ్ కుమార్ కి మాకేంటి సంబంధం..?
  • మేము ఎవర్ని సపోర్ట్ చేయడం లేదు…నిందించడం లేదు
  • వాస్తవాలు బయటకు తీయండి అని మాత్రమే అడుగుతున్నాం
  • చనిపోయిన వ్యక్తి మా పార్టీ నాయకుడు
  • ఆ లీకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి…ఇవన్నీ చూస్తే అనుమానాలు రావా
  • వివేకా చనిపోయి మేము ఎంత బాధలో ఉన్నాం అనేది మాకు తెలుసు
  • ఒక ఎస్పీని ప్రభుత్వం హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనడానికి సిగ్గు లేదా
  • ఒక జైలర్ రొటీన్ ట్రాన్స్ఫర్ లో వస్తే నానా యాగీ చేశారు
  • ఎప్పుడు కుట్రలో బతికే బతుకు మీది
  • రాజకీయాల్లో ఒక హుందాతనం లేదా…ఎందుకింత దిగజారిపోతున్నారు
  • నిత్యం వ్యక్తిత్వ హననం చేస్తూనే ఉన్నారు
  • మాకు అధికారమే ముఖ్యం..ఎప్పుడూ మేమే అధికారంలో ఉండాలి అనుకోవడం తప్పు
  • సిట్ రిపోర్ట్ ఏమిచ్చిందో రానివ్వండి
  • ప్రభుత్వం మంచి చేస్తుంటే ఓర్చుకోలేరు
  • ఉద్యోగులకు మంచి చేస్తుంటే వాళ్ళని రెచ్చగొడతారు
  • సినీ రంగం సమస్యలను పరిష్కారించాలంటే దాన్నీ రాజకీయం చేస్తారు
  • ఎప్పుడూ ఈ ప్రభుత్వం వ్యవస్థలపై గౌరవంతో ఉంది
  • మీరు అవాస్తవాలను మాట్లాడుతున్నందుకు మీపై కేసు వేయవచ్చు
  • మేము మా మంత్రి చనిపోయిన షాక్ లో మేముంటే ఆయనపై కూడా నీచంగా మాట్లాడుతున్నారు
  • నోటికి ఏదోస్తే అది మాట్లాడటం దుర్మార్గం
RELATED ARTICLES

Most Popular

న్యూస్