Saturday, June 29, 2024
Homeసినిమాముగ్గురు కుర్రాళ్ల చుట్టూ తిరిగే కథ .. 'శ్రీరంగనీతులు'

ముగ్గురు కుర్రాళ్ల చుట్టూ తిరిగే కథ .. ‘శ్రీరంగనీతులు’

ఈ మధ్య కాలంలో సినిమాల టైటిల్స్ చాలా వింతగా .. విచిత్రంగా ఉంటున్నాయి. తమ సినిమా టైటిల్ కి అర్థం ఏమిటనేది అందరూ కలిసి అదే పనిగా గూగుల్ లో సెర్చ్ చేయాలనే ఉత్సాహం చాలామంది మేకర్స్ లో కనిపిస్తోంది. ‘ఇదేం టైటిలండీ బాబూ ..’ అని అడిగే సాహసం ఎవరూ చేయరు. ఎందుకంటే ట్రెండ్ పేరు చెప్పి అతణ్ణి అమాంతంగా వెలేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ‘శ్రీరంగనీతులు’ అనే టైటిల్ వినగానే, అందరూ షాక్ అయ్యారు. పాతకాలం నుంచి ఈ టైటిల్ పట్టుకొచ్చిందెవరయ్యా అంటూ అంతా ఆ సినిమా వైపు ఒక లుక్ వేశారు.

టైటిల్ పాతదే అయినా .. చాలా కాలం తరువాత వినడానికి సౌండ్ కూడా బాగా అనిపిస్తుంది .. పలకడానికి కూడా హాయిగా ఉందని అంతా అనుకున్నారు. ఇక ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించిన సుహాస్ .. కార్తీక్ రత్నం గ్రామీణ నేపథ్యంతో కూడిన కథలతో మెప్పిస్తూ వెళుతున్నవారే. విరాజ్ అశ్విన్ కూడా మంచి గుర్తింపు ఉన్నవాడే. రుహాని శర్మ విషయానికి వస్తే, తన పాత్రలో విషయం లేకపోతే చేసే రకం కాదామే. అందువలన మొత్తానికి ఈ కంటెంట్ లో .. ఈ కాన్సెప్ట్ లో ఏదో విషయమైతే ఉందని భావించినవారు నిన్న ఈ సినిమాకైతే వెళ్లిపోయారు.

శ్రీరంగనీతులు’ .. ఎవరు ఎవరికి చెప్పారు? అనే ప్రశ్నకి సమాధానాలను తెరపైనే వెతుక్కోవాలి. దర్శకుడు ప్రవీణ్ కుమార్ మాత్రం మూడు ప్రధానమైన పాత్రల నుంచి తాను అనుకున్న నీతిని చెప్పడానికి ట్రై చేశాడు. శివ .. కార్తీక్ .. వరుణ్ అనే ముగ్గురు యువకుల జీవితాలను తెరపై ఆవిష్కరించాడు. ఈ ముగ్గురూ ఎలాంటి సమస్యలతో సతమతమవుతున్నారనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ పాత్రల బలాలు .. బలహీనతలు కథను నడిపిస్తూ ఉంటాయి. దర్శకుడు సహజత్వానికి దగ్గరగా ఈ పాత్రలను తీసుకెళ్లడంలో .. సందేశాన్ని ఇవ్వడంలో కొంతవరకూ సక్సెస్ అయ్యాడు. అయితే కథ మొత్తాన్ని పట్టుగా చెప్పడంలో తడబడ్డాడు. లేదంటే ఆడియన్స్ నుంచి మరిన్ని మంచి మార్కులు పడేవేమో!

RELATED ARTICLES

Most Popular

న్యూస్