Sunday, January 19, 2025
Homeసినిమాఓజీ.. అందుకే చేస్తున్నాను - శ్రియా రెడ్డి

ఓజీ.. అందుకే చేస్తున్నాను – శ్రియా రెడ్డి

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో రూపొందుతున్న భారీ చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కు జంటగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఓజీ అని అనౌన్స్ చేసినప్పటి నుంచి అసలు ఈ టైటిల్ అర్థం ఏంటి..? ఈ సినిమా కథ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. ఓజీ అంటే ఓరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్థమని.. ఇది గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే కథ అని వార్తలు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా ఈ సినిమాలో శ్రియారెడ్డి నటిస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇటీవల ఈ మూవీ గురించి శ్రియా రెడ్డి చేసిన కామెంట్స్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచేశాయని చెప్పచ్చు. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. ఈ సినిమాలో నటించాలని ఆఫర్ వచ్చినప్పుడు రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ ఏమో విని నో చెప్పేద్దాం అనుకున్నాను కానీ.. డైరెక్టర్ సుజిత్ కథ చెప్పిన 5 నిమిషాల్లోనే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాను. అంతలా ఈ సినిమా కథ నచ్చిందని అసలు విషయం బయటపెట్టింది. ఈ సినిమా కథ, అందులో తన క్యారెక్టర్ బాగా ఎగ్జైట్ చేసిందని చెప్పింది. ఓజీ గురించి ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్