Saturday, March 29, 2025
Homeసినిమాసిఐఐ కల్చరల్ సదస్సుకు స్టాలిన్

సిఐఐ కల్చరల్ సదస్సుకు స్టాలిన్

CII-Cinema: దక్షిణాది సినిమాల్లో ఒకప్పుడు అగ్ర హీరోయిన్లుగా వెలుగొందిన తారలు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో  దిగిన గ్రూప్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) చెన్నైలో ‘Culturally Rooted- Creatively Global’ నినాదంతో ‘దక్షిణ్ సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్  సమ్మిట్’ పేరిట నిర్వహించిన సదస్సుకు ముఖ్యమంత్రి స్టాలిన్ అతిథిగా హాజరయ్యారు. సమావేశం అనంతరం నటీమణులు సుహాసిని, ఖుష్బూ సుందర్, లిజి, సుజాత విజయ్ కుమార్ లు  స్టాలిన్ తో ఫోటో దిగారు.

ఈ ఫోటోను ఖుష్బూ ట్విట్టర్ లో షేర్ చేస్తూ “సిఐఐ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సిఎం స్టాలిన్ కు కృతజ్ఞతలు, మీరు ఈ సమావేశంలో హృదయంతో మాట్లాడారు, మీ మాటలు మాకెంతో స్పూర్తినిచాయి’ అంటూ స్టాలిన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈ సిఐఐ సదస్సులో సుప్రసిద్ధ దర్శకులు మణి రత్నం, ఎస్ ఎస్ రాజమౌళి, సుకుమార్ లతో కలిపి సిఐఐ ఓ చర్చా గోష్టి కూడా నిర్వహించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్