రాష్ట్రంలో విద్యా వ్యవస్థను జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, ప్రథమ స్థాయిలో ఉండాల్సిన దానిని అథమ స్థాయికి తీసుకువచ్చారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోయినట్లు అసర్ కమిటీ నివేదిక బైట పెట్టిందని చెప్పారు. నాణ్యమైన విద్యలో 3నుంచి 19వ స్థానానికి రాష్ట్రం పడిపోవడం ఆందోళనకరమని అన్నారు. అసమర్ధ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ పెరిగిపోయాయని, జగన్ పర్యటనల కోసం స్కూల్ బస్సులు బలవంతంగా లాక్కొని విద్యాసంస్థలను మూసి వేస్తున్నారని విమర్శించారు. ఏటా డిఎస్సీ నిర్వహిస్తామన్న జగన్… ఇంతవరకూ ఒక్క డిఎస్సీ కూడా వేయలేదని, పైగా విలీనం పేరుతో మూడున్నర లక్షల మందిని విద్యకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులతో మద్యం అమ్మించిన చరిత్ర జగన్ కే దక్కుతుందన్నారు. అమ్మ ఒడిని నాన్న బుడ్డిగా మార్చి వేశారన్నారు. నాడు-నేడును దోపిడీగా మార్చేశారని, ప్రజలను మోసగించెందుకే పత్రికా ప్రకటనలు ఇస్తున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.