Saturday, November 23, 2024
HomeTrending Newsనిధులు మావి- ప్రచారం మీదా?: జీవీఎల్

నిధులు మావి- ప్రచారం మీదా?: జీవీఎల్

Publicity War:  కుటుంబ పార్టీల పాలన వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమో ప్రజలకు తెలియజెబుతామని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సమస్యలకు కేంద్రంపై నిందలు మోపే కల్చర్ ను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ప్రకటించారు. ఢిల్లీలో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు.  ఆంధ్ర ప్రదేశ్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉన్నా జగన్ ప్రభుత్వం తమ సొంత స్టిక్కర్లు వేసుకుంటుందని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద  కేంద్రం రాష్ట్రానికి 21 లక్షల ఇళ్ళు ఏపీకి కేటాయించి, 12 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇస్తే కేంద్రం పేరు కూడా ఎక్కడా ప్రస్తావించడంలేదని మండిపడ్డారు.  ఇటీవల తాము వివిధ జిల్లాలు పర్యటించినప్పుడు ఆవాస్ యోజన కింద ఇళ్ళు కడుతున్న ప్రాంతాల్లో మోడీ ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశామని, త్వరలో రాష్ట్రమంతా ఇదే విధంగా చేస్తామన్నారు.

బియ్యం సబ్సిడీ నిధులు కూడా కేంద్రమే భారిస్తుంటే మీ స్టిక్కర్లు వేసుకోవడం దారుణం కాదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. త్వరలో కేంద్ర మంత్రులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని జీవీఎల్ వెల్లడించారు.  కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుక్ మాండవీయ 26న విజయనగరంలో పర్యటిస్తారని, కడపజిల్లాలో ధర్మేంద్ర ప్రదాన్, విశాఖలో జై శంకర్ పర్యటిస్తారని తెలిపారు.

ఇటీవల ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై తాము చేపట్టిన యాత్రకు మంచి స్పందన వచ్చిందని, తమ యాత్ర తరువాత కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించిందని జీవీఎల్ వివరించారు. రాష్ట్రానికి అదనంగా నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం అంగీకరించిందని ఈ నిధులను దీర్ఘ కాలిక ప్రయోజనాల కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం వినియోగించే విధంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తామన్నారు.  రాష్ట్రానికి సంబధించిన నీటిపారుదల ప్రాజెక్టులపై పార్లమెంట్ లో తాను ప్రస్తావిస్తానని, తద్వారా కేంద్రం నుంచి రాష్ట్రంపై ఒత్తిడి తీసుకు వచ్చి వాటిని సక్రమంగా నిర్వహించేందుకు, పూర్తి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Also Read : వారిని నిలదీయండి: సిఎం పిలుపు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్