Saturday, January 18, 2025
Homeసినిమామ‌రోసారి వార్త‌ల్లోకి చైతు, ప‌ర‌శురామ్ మూవీ

మ‌రోసారి వార్త‌ల్లోకి చైతు, ప‌ర‌శురామ్ మూవీ

యువ స‌మ్రాట్ నాగ‌చైత‌న్య ఫుల్ జోష్ లో ఉన్నాడు. మ‌జిలీ చిత్రం నుంచి విజ‌యాత్ర మొద‌లైంది. మ‌జిలీ, వెంకీమామ‌, ల‌వ్ స్టోరీ, బంగార్రాజు… ఇలా వ‌రుస విజ‌యాలు సాధిస్తోన్న నాగ‌చైత‌న్య తాజాగా థ్యాంక్యూ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ నెల 22న థ్యాంక్యూ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా కూడా స‌క్సెస్ అవ్వ‌డం ఖాయం అనే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్య‌తో గీత గోవిందం త‌ర్వాత‌ ప‌ర‌శురామ్ ఓ సినిమా చేయాలి అనుకున్నారు. నాగ‌చైత‌న్య‌కి క‌థ చెబితే న‌చ్చి ఓకే చెప్ప‌డం.. అఫిషియ‌ల్ గా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయ‌డం కూడా జ‌రిగింది. అయితే.. అనుకోకుండా ప‌ర‌శురామ్ కి మ‌హేష్ తో సినిమా చేసే అవ‌కాశం రావ‌డంతో చైత‌న్య ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టి మ‌హేష్ తో సర్కారు వారి పాట సినిమా చేశాడు. ఆత‌ర్వాత చైత‌న్య‌తో సినిమా చేయాలి అనుకున్నాడు ప‌ర‌శురామ్.

అయ‌తే.. ఈలోపు నాగ‌చైతన్య ద‌గ్గ‌ర క్యూ పెరిగింది. మూడు నాలుగు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ప్ర‌స్తుతం దూత వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఆత‌ర్వాత వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ష‌న్ లో తెలుగు, త‌మిళ్ మూవీ చేస్తున్నాడు. ఆత‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో సినిమా చేసేందుకు నందినీ రెడ్డి, రాహుల్ సాంకృత్య‌న్, కిషోర్ తిరుమ‌ల ఇలా పెద్ద లిస్టే ఉంది. దీంతో ప‌ర‌శురామ్ తో సినిమా అనేది ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు. గోవాలో ప‌ర‌శురామ్ క‌థ పై క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌. మ‌రో వైపు ఇప్ప‌ట్లో ఈ ప్రాజెక్ట్ ఉండ‌దు అని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో  అసలు ఈ ప్రాజెక్ట్ ఉందో..?  లేదో..? అనే విషయమై చైత‌న్య త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read :  నాగ‌చైత‌న్య స‌ర‌స‌న శ్రీలీల లేదా సాక్షి? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్