Saturday, November 23, 2024
HomeTrending Newsప్రభుత్వ ఆసుపత్రుల్లో మురుగునీటి శుద్ది ప్లాంట్లు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మురుగునీటి శుద్ది ప్లాంట్లు

Govt Hospitals : పర్యావరణ ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఆసుపత్రుల్లో రోగుల చికిత్సలో వెలువడే జీవ వైద్య (బయోమెడికల్) వ్యర్థాలను, వ్యర్ధ జలాలను బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రుల్స్ 2016 అనుగుణంగా నిర్వహణ & సక్రమంగా శుద్ధి చేయాల్సి ఉంది. ఆసుపత్రుల నుంచి ఉద్భవించే ద్రవ వ్యర్ధాల నిర్వహణ పకడ్బందిగా చేపట్టాల్సి ఉంది. లేనట్లయితే ఆ వ్యర్థాలు పరిసరాలు మరియు సమీప నీటి వనరులు కాలుష్యం బారిన పడే అవకాశం ఉంది.

ఈ పరిస్థితి తలెత్తకుండా ఆసుపత్రుల్లోని జీవ వ్యర్థాల ను శుద్ది చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చొరవతో సక్రమంగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సంవత్సల తరబడి పెండింగ్ లో ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (STP) ఏర్పాటుకు మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని అతితక్కువ కాలంలో రాష్ట్రంలోని 20 పెద్ద ఆస్పత్రులలో మురుగు నీటి శుధ్ది నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పలు సమావేశాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, పీసీబీ ఛైర్మన్ రాజీవ్ శర్మ, పీసీబీ మెంబర్ సెక్రటరీ నీతూకుమారి ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి లతో నిర్వహించి, ఎస్టీపీ ప్లాంట్లు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని గాంధీ, ఉస్మానియా. ఎంజీఎం, టిమ్స్, నీలోఫర్ సహా, 20 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మురుగు నీటి శుధ్ది ప్లాంట్ల ఏర్పాటు మరియు మూడు సంవత్సరాల నిర్వహణ వ్యయం కోసం 68.31 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలన పరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 52.59 కోట్లు మురుగునీటి శుధ్ది ప్లాంట్ల ఏర్పాటుకు, మరో 15.72 కోట్లు మూడేళ్ల పాటు ఈ ప్లాంట్ల నిర్వహణ ఖర్చు చేయాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

గాంధీ, ఉస్మానియా, టిమ్స్, నీలోఫర్, ఆసుపత్రులతో పాటు మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సూర్యపేట, నల్గొండ, ఆదిలాబాద్ రిమ్స్, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, జగిత్యాల, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సిద్దిపేట మెడికల్ కాలేజి, ఖమ్మం, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మురుగు నీటి శుద్ది ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

ఈ 20 ఆసుపత్రుల్లో కలిపి 15450 బెడ్లు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు సరైన మురుగు నీటి వ్యవస్థ లేదు. ఇది గమనించిన ప్రభుత్వం ఆధునిక మురుగు నీటి శుద్ధి నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈమేరకు ఇవాళ అందుకు సంబంధించిన నిధులు 68.31 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

ఆసుపత్రుల్లోని ఆపరేషన్ ధియెటర్ల నుంచి వెలువడే ద్రవ జీవ వ్యర్థాలు, హాస్పిటల్ ల్యాబరెటరీల నుండి వెలువడే వ్యర్థాలు, అదే రీతిలో పేంషట్ల బెడ్లను, బెడ్ షీట్లను, వార్డులను శుభ్రం చేసే సమయంలో వెలువడే వ్యర్థాల్లోని వైరస్ ల వల్ల పలు ఇన్ఫెక్షన్లకు, కాలుష్యానికి కారకమవుతాయి. వీటిని అలానే వదిలేస్తే నీటి వనరులు కలుషితమయి ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదముంది. దీన్ని అరికట్టేందుకు ఆసుపత్రుల్లో ఈ ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు.

హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆపరేషన్ ధియెటర్, ల్యాబ్ లు, పెషంట్ల బెడ్లు, బెడ్ షీట్స్ ఉతకడం వల్ల, వార్డులను శుభ్రపరిచే సమయంలో వచ్చే వ్యర్థాలను ముందుగా డిస్ ఇన్ఫెక్షన్ చేసి ఎస్టీపీలకు పంపుతారు. ఆ తర్వాత ఆ మురుగు నీటిని శుద్ధి చేసి కేంద్ర జీవ వైద్య వ్యర్ధ నిర్వహణ నిబంధనలు 2016 అనుసరించి శుద్ధి చేసి పునర్వినియోగిచుకోవడానికి లేదా బయటకు వదులుతారు. ఇలా చేయడం వల్ల ఇతర నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటుంది. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోను ఇదే రీతిలో ఎస్టీపీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లోను ఇదే రీతిలో జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ కు ఎస్టీపీలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్