Sunday, January 19, 2025
HomeTrending Newsటీచర్ల సమస్యలను పరిష్కరిస్తం: నిరంజన్ రెడ్డి

టీచర్ల సమస్యలను పరిష్కరిస్తం: నిరంజన్ రెడ్డి

కేంద్రం రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యుత్, మంచి నీటి‌ సమస్యలను పరిష్కరించుకున్నట్లు చెప్పారు. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్టీయూ 75 ఏళ్ల వజ్రోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

త్వరలోనే ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. మనదేశంలో విద్యావ్యవస్థ కొంత గందరగోళంగా ఉందని.. సమగ్ర విద్యావిధానం రూపొందించి అమలు చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. తమ హక్కుల కోసం పని చేయడం సంఘాల పని అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్