Saturday, January 18, 2025
Homeసినిమానైట్రో స్టార్ ఇక నుంచి యువ దళపతి!

నైట్రో స్టార్ ఇక నుంచి యువ దళపతి!

సాధారణంగా తమ పేరుకు ముందు ఏదో ఒక బిరుదు లేని హీరోలు కనిపించరు. చాలామంది హీరోల పేరుకు ముందు ఏదో ఒక బిరుదు ఉంటూనే ఉంటుంది. అసలు మొదటి సినిమాతోనే ఏదో ఒక బిరుదుతో పరిచయమయ్యే హీరోలు కూడా లేకపోలేదు. హీరోలకు బిరుదు అనేది ఇంటి పేరుగా మారిపోవడమనేది చాలా కాలంగా కనిపిస్తూనే ఉన్న ఒక కామన్ విషయం.

గతంలో సీనియర్ స్టార్ హీరోల బిరుదులు అలాగే ఉండేవి. చిరంజీవి క్రేజ్ ను బట్టి ఆయన బిరుదులు మాత్రం మారుతూ వచ్చాయి. అలా సుప్రీమ్ హీరో తర్వాత ఆయన పేరుకు ముందు మెగాస్టార్ చేరింది. ఇక రీసెంట్ గా బన్నీ బిరుదు కూడా మారిపోయిన సంగతి తెలిసిందే. చరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.

ఇప్పుడు అదే పద్ధతిలో మరో హీరో బిరుదు మారబోతోంది .. ఆ హీరో పేరే సుధీర్ బాబు. మొదటి నుంచి కూడా సుధీర్ బాబు వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఇంతవరకూ ఆయన పేరుకు ముందు ‘నైట్రో స్టార్’ అనే బిరుదు కనిపిస్తూ వచ్చింది. కానీ ‘హరోం హర’ సినిమా నుంచి ఆయన ‘యువ దళపతి’ బిరుదుతో ముందుకు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. జ్ఞానసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 14వ తేదీన విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్