Sunday, January 19, 2025
Homeసినిమా'శ్రీదేవి సోడా సెంటర్’ మంచి పులస లాంటి సినిమా : సుధీర్ బాబు

‘శ్రీదేవి సోడా సెంటర్’ మంచి పులస లాంటి సినిమా : సుధీర్ బాబు

సుధీర్ బాబు, ఆనంది జంటగా పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”.  ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యనే సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా సినిమా ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్నీ సమపాళ్లలో శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా హీరో ప్రభాస్ సినిమా టీజర్ ను విడుదల చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల చేస్తున్న సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లోని “N” కన్వెన్షన్ లో సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.

ఈ వేడుకలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ “మా సినిమాను ఆశీర్వదించాలని వచ్చిన పెద్దలకు, ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మొదటగా చిరంజీవి గారికి థాంక్స్ చెప్పాలి. అడిగిన వెంటనే మందులోడా సాంగును రిలీజ్ చేశారు. మా సమ్మోహనం మూవీ కూడా ఆయన సపోర్టుతోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాం. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గురువు గారు మెగాస్టార్ తో స్టార్ట్ చేశాం. ఆయన నాకు గ్రేట్ సపోర్టరే కాక నాకు ఆయనది లక్కీ హ్యాండ్ కూడా.. అలాగే ప్రభాస్ గారు మా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇంటికి పిలిచి ఎంతో ఆప్యాయంగా నన్ను అక్కున చేర్చుకున్నారు. మంచితనానికి మరో పేరే ప్రభాస్” అని సంతోషం వ్యక్తం చేశారు.

“మహేష్ బాబు గారిని నేను ఎంతో అభిమానిస్తాను. నేను ఆయనకు థాంక్స్ చెప్పి దూరం చేసుకోలేను. మహేష్ ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ సుధీర్ కు కరెక్ట్ సినిమా పడితే ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు అన్నాడు. ఆయన అన్న సినిమా ఇదే అవుతుంది అనుకుంటున్నాను నేను. దర్శకుడు ‘పలాస’ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. ‘పలాస’ కంటే ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో సూరిబాబు రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కి సూరిబాబు, శ్రీదేవి జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉంటాయి. వాళ్ల కోసం మళ్ళీ ఈ సినిమా చూడ్డానికి థియేటర్ కు వస్తారు ఈ సినిమా అంత బాగా ఉంటుంది. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కథ ఇది. గోదావరి భాషలో చెప్పాలంటే ఇది మంచి పులస లాంటి సినిమా ఇప్పుడు సీజన్ కూడా పులస సీజనే..అదే సీజన్లో ఈ సినిమా వస్తోంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను రొటీన్ సినిమాలు చెయ్యను డిఫరెంట్ గా ఉండే కథల్ని సెలెక్ట్ చేసుకుని చేస్తాను. ఎందుకు చెప్పానో ఈ నెల 27న రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా నచ్చుతుంద”ని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్