Tuesday, September 24, 2024
Homeసినిమాతొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సుడిగాలి సుధీర్ G.O.A.T

తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సుడిగాలి సుధీర్ G.O.A.T

సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (GreatestOfAllTimes) అనేది ఉపశీర్షిక. దివ్యభారతి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ పతాకం పై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మిస్తున్నారు.  ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..  ఇటీవల విడుదల చేసిన టైటిల్ ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో తొలిషెడ్యూల్‌ను పూర్తిచేశాం. ఈ షెడ్యూల్‌లో సుధీర్, హీరోయిన్ దివ్యభారతిల పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఏపిసోడ్స్‌ను చిత్రీకరించాం. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడుకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిసున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం చాలా ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్