Friday, April 19, 2024
HomeTrending Newsఆఫ్ఘన్లో రష్యా ఎంబసీ వద్ద ఆత్మాహుతి దాడి

ఆఫ్ఘన్లో రష్యా ఎంబసీ వద్ద ఆత్మాహుతి దాడి

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ లో ఈ రోజు భారీ బాంబు పెల్లుడు సంభవించింది. కాబుల్ లోని రష్యా రాయాబార కార్యాలయ గేటు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడులో ఇద్దరు రష్యా రాయబార కార్యాలయ ఉద్యోగులతో పాటు సుమారు ఇరవై మంది మృత్యువాత పడ్డారు. ఆత్మాహుతికి పాల్పడిన నిందితున్ని గుర్తించిన తాలిబాన్ సైనికులు వెంటనే కాల్పులకు దిగారు. అప్పటికే సూసైడ్ బాంబర్ తనను తానూ పేల్చుకున్నాడు. ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఎవరు అనేది తెలియ రాలేదు.

ఆఫ్ఘన్ లో ప్రజా ప్రభుత్వం కూల్చి తాలిబాన్ లు అధికారంలోకి వచ్చాక అన్ని దేశాల తమ రాయబార కార్యాలయాలు మూతపడ్డాయి. అధికారికంగా ఏ దేశం కూడా తాలిబాన్ ల ప్రభుత్వాన్ని గుర్తించలేదు. ఈ క్రమంలో రష్యా కూడా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించక పోయినా కాబుల్ లో రాయబార కార్యాలయం నిర్వహిస్తోంది. తాలిబాన్ అధికార వర్గాలతో రాయబార కార్యాలయం ద్వారా రష్యా చర్చలు జరుపుతోంది. తాజాగా రష్యా రాయాబర కార్యాలయం మీదే దాడికి తెగపడటం తాలిబాన్ పాలకులకు సవాల్ గా మారింది.

Also Read : ఆఫ్ఘన్లో హిందువులు, సిక్కులకు రక్షణగా తాలిబాన్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్