Sunday, January 19, 2025
HomeసినిమాRavi Teja-Sumanth: రవితేజ మూవీలో సుమంత్?

Ravi Teja-Sumanth: రవితేజ మూవీలో సుమంత్?

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ ప్రేమకథ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సత్యం, గౌరి, గోదావరి, గోల్కండ హైస్కూల్ ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించాడు కానీ బ్లాక్ బస్టర్ సక్సెస్ రాలేదు. ‘మళ్లీ రావా’ తో ఫామ్ లోకి వచ్చిన సుమంత్ హీరోగానే కాకుండా.. మంచి పాత్ర అయితే వేరే హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇటీవల ‘సీతారామం’ లో విభిన్న పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

ఇదిలా ఉంటే.. రవితేజ నటించిన ‘రావణాసుర’ లో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించాడు. ఇప్పుడు రవితేజ మూవీలో సుమంత్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.  రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం  వహిస్తున్న ఈగల్ అనే సినిమాలో సుమంత్ నటిస్తున్నాడు.

అయితే… ఇందులో సుమంత్ పాత్ర ఏంటి..? రవితేజ, సుమంత్ పాత్ర మధ్య ఉన్న రిలేషన్ ఏంటి.? అనేది తెలియలేదు. త్వరలోనే ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. సుమంత్ వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ కథ అందులోని అతని పాత్ర నచ్చితేనే ఒప్పుకుంటున్నాడు లేకపోతే నో చెప్పేస్తున్నాడు. మరి.. రవితేజ, సుమంత్ కలిసి ఈ సినిమా ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్