Sunday, January 19, 2025
Homeసినిమాసుమంత్ కొత్త చిత్రం ‘అహం రీబూట్’

సుమంత్ కొత్త చిత్రం ‘అహం రీబూట్’

Sumanths Aham Reboot Movie Launched :

సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అహం రీబూట్’. ఈ చిత్రాన్నివాయుపుత్ర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలోరఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకులు చందూ మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, శరణ్ కొప్పిశెట్టి క్లాప్ కొట్టారు.

సుమంత్ ఆర్జే క్యారెక్టర్ లో కనిపించనున్న అహం రీబూట్ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని చెబుతున్నారు దర్శకుడు ప్రశాంత్ సాగర్. అహం అంటే నేను. అహం రీబూట్ అంటే సెల్ఫ్ రీబూట్, ఈగో, పొగరు, ద్వేషం లాంటి అర్థాలు కాకుండా అహం అంటే నేను అనే విషయాన్నిచెబుతున్నాం అన్నారు దర్శకుడు ప్రశాంత్ సాగర్. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Also read :  ‘మళ్ళీ మొదలైంది’ సుమంత్ క్యారెక్ట‌ర్ రివీలింగ్ పోస్ట‌ర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్