Tuesday, September 17, 2024
Homeసినిమాప్రతి పండగకీ నేనుంటా - సుమ కనకాల

ప్రతి పండగకీ నేనుంటా – సుమ కనకాల

Festivals for Joy:
సుమ కనకాల యాంకర్‌ గా, నటిగా గత 20 ఏళ్లుగా మన ఇంటి ఆడపడుచులా మనందరితో ఉన్న విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ’ఫెస్టివల్స్‌ ఫర్‌ జాయ్‌’ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్టాపించారు ఆమె. దసరా సందర్భంగా ప్రారంభమైన ఈ సంస్థ… ‘ప్రజ్వల’ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్‌ సంరక్షణలో ఉన్న పది మంది మహిళలకు జీవనోపాధి కల్పించడానికి ఆర్థిక సహాయం, అక్కడే  ఉంటున్న పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్‌ ఏర్పాటు చేశారు.

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన చిత్ర పరిశ్రమ కు చెందిన 10 మంది మహిళలకు ఏడాది పాటు నిత్యావసర వస్తువులను, వారికి అవసరమైన మెడిసిన్‌ అందించారు. డిసెంబర్ 5, ఆదివారం…ఆరోగ్య పరిరక్షణ కోసం గ్రేస్‌ ఫౌండేషన్, తానా సహకారంతో చిత్ర, టెలివిజన్‌ పరిశ్రమలకు చెందిన 250 మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ను నిర్వహించారు. ఈ స్క్రీనింగ్‌ లో 10 మందికి క్యాన్సర్‌ లక్షణాలు కనిపించాయని గ్రేస్‌ ఫౌండేషన్‌ వైద్యులు డాక్టర్‌ ప్రమీల, డాక్టర్‌ చినబాబు తెలిపారు.  వీరికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించి… మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. క్రిస్మస్ పురస్కరించుకొని ఈ టెస్టుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ “భారతదేశంలోని అన్ని ముఖ్యమైన పండగల సందర్భంగా ‘ఫెస్టివల్స్‌ ఫర్‌ జాయ్‌’ సంస్థ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాం. కుల, మతాలకు అతీతంగా మా సంస్థ సేవలు ఉంటాయి’’ అన్నారు. డాక్టర్‌ చినబాబు మాట్లాడుతూ–‘‘స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేసిన ప్రతి ఒక్కరితో టచ్‌లో ఉంటాం. వ్యాధి నిర్ధారణ అయిన వారికి తక్కువ ఖర్చుతో ఎక్కడ వైద్యం చేస్తారో తగిన సలహాలు, సూచనలను మా ‘గ్రేస్‌ ఫౌండేషన్‌’ తరఫు నుంచి అందిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ప్రమీల, తానా తరపున ట్రస్టీ విద్య గారపాటి పాల్గొన్నారు.

Also Read : ఆకట్టుకుంటున్న గ్యాంగ్ స్టర్ గంగరాజు ‘ఎల్లా..ఎల్లా’ సాంగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్