Sunday, January 19, 2025
HomeTrending Newsరఘురామకృష్ణంరాజుకి బెయిల్

రఘురామకృష్ణంరాజుకి బెయిల్

నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుకి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచికత్తు సమర్పించాలని, దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు విచారణకు వెళ్లాలని, దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, తన గాయాలను ఎక్కడా ప్రదర్శించకూడదని షరతులు పెట్టింది. నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.

రఘురామ రాజును విచారించాలంటే 24 గంటల ముందుగా నోటీసు ఇవ్వాలని, న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని సిఐడికి సూచించింది.  న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ, జస్టిస్ బి. ఆర్. గవాయ్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

అంతకుముంది ఆర్మీ ఆస్పత్రి నివేదికను కోర్టులో ధర్మాసనం చదివి వినిపించింది. జనరల్ ఎడిమా ఉన్నట్లు, రఘురామ పాదాలకు గాయాలున్నట్లు, కాలి వేలుకి ఫ్రాక్చర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.  గుంటూరు జిజిహెచ్ ఆస్పత్రి నివేదికకు, ఆర్మీ ఆస్పత్రి నివేదికకు మధ్య ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేసిన దుష్యంత్ దవే విచారణ సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. రఘురామా తనకు తానూ చేసుకున్న గాయాలను మీరు భావిస్తున్నారా అంటూ దవేను బెంచ్ ప్రశ్నించింది.

తక్షణమే విచారణ పూర్తి చేయాలని, కస్టడిలో చిత్రహింసలు చేసినట్లు నిజమేనని తేలిందని, తక్షణమే బెయిల్ ఇచ్చి సిబిఐ విచారణకు ఆదేశించాలని ముకుల్ రోహత్గి విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రి నివేదికను ఇరు వర్గాలకు మెయిల్ పంపుతామని పరిశీలించిన అనంతరం అనతరం మళ్ళి రావాలని సూచిస్తూ కేసును మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

అనంతరం కూడా ఈ కేసులో వాడ ప్రతివాదనలు జరిగాయి. సిఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్ వేశారని,  అదికార పార్టీ లోపాలను రఘురామ ఎత్తి చూపుతున్నారని, అందుకే ఈ కేసు పెట్టారని, బెయిల్ రాకుండా అడ్డుకునేదుకే  124ఏ సెక్షన్ పెట్టారని, ఏపి పోలీసులు కావాలనే వేధించారని, ఈ కేసు బోగస్ అని ముకుల్ రోహిత్గి వాదించారు.

ఈ కేసుపై ప్రత్యామ్నాయాలున్నా సుప్రీంకోర్టుకు రావడం సరికాదని, ఎంపిగా ఉన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాలని, జనాల్ని దాడులు చేయమని ఎంపి చెప్పవచ్చా అని దుష్యంత్ దవే వాదించారు. వివిధ వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు చంపుకోమన్నట్లుగా అయన మాట్లాడారన్నారు. రఘురామకే కాదు, కంగనా రనౌత్ కు కూడా వై కేటగిరి భద్రత వుందని దవే అన్నారు.  ఆర్మీ ఆస్పత్రి నివేదికను తప్పుబట్టడం లేదని, కాని పోలీసులు కొట్టడంవల్లే గాయాలు అయ్యాయని రిపోర్టులో లేదని దవే అన్నారు, క్రిస్టియన్లకు, రెడ్లకు వ్యతిరేకంగా విద్వేషాలు రేచ్చాగోట్టీలా రఘురామ మాట్లాడారని కోర్టు దృష్టికి తెచ్చారు.  వాదనలను అన్ని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్