Sunday, January 19, 2025
HomeTrending NewsSupreme Court: సిట్ పై హైకోర్ట్ స్టే కొట్టివేత

Supreme Court: సిట్ పై హైకోర్ట్ స్టే కొట్టివేత

చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై  దర్యాప్తుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ పై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

అమరావతి భూ కుంభకోణం సహా కీలక ప్రాజెక్టులు, పలు విధానాలలో జరిగిన అవినీతిపై దర్యాప్తుకు  ఆటంకాలు తొలగినట్లయ్యింది.

సుప్రీం కోర్టు తీర్పులో ముఖ్యాంశాలు:

  • దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న సుప్రీంకోర్టు
  • సిబిఐ , ఈడీ దర్యాప్తుకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదు
  • సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదు
  • *జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదన్న సుప్రీం
  • చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలపై సిట్ దర్యాప్తుకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం
  • ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా , దురుద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి అని విచారణ సందర్భంగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు
  • గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని విచారణ సమయంలో వ్యాఖ్యానించిన సుప్రీం
  • ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని వాదనలు వినిపించిన ఏపీ ప్రభుత్వం
  • ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన ప్రభుత్వం
  • దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుందని వాదన
RELATED ARTICLES

Most Popular

న్యూస్