Sunday, September 8, 2024
HomeTrending NewsSupreme Court: బాబు స్క్వాష్ పిటిషన్ పై రేపు విచారణ

Supreme Court: బాబు స్క్వాష్ పిటిషన్ పై రేపు విచారణ

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన రిమాండ్ ను కొట్టి వేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ పై విచారణను భారత సర్వోన్నత న్యాయస్థానం రేపు విచారించనుంది. ఈ పిటిషన్ పై నిన్న ప్రధాన న్యాయమూర్తి ఎదుట బాబు తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా ప్రస్తాచించారు. దీనిపై రేపు మెన్షన్ చేయాలని సీజే సూచించారు. నేడు ప్రధాన న్యాయమూర్తి క్యూరేటివ్ బెంచ్ లో బిజీగా ఉండడంతో,  రిజిస్ట్రార్ వద్ద సిద్దార్థ్ లూత్రా  ప్రస్తావించారు.  దీనితో రేపు లిస్టింగ్ చేశారు.

ఈ కేసులో ఈ నెల 8న చంద్రబాబును అదుపులోకి తీసుకున్న ఏపీ ఐసిడి 9న ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచింది. బాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈనెల 22 లో ఈ గడువు ముగియడంతో మరో రెండ్రోజులపాటు రిమాండ్ పొడిగిస్తూ రెండ్రోజుల పోలీస్ కస్టడీ కూడా మంజూరు చేశారు. మరోసారి అక్టోబర్ 5 వరకూ బాబు రిమాండ్ ను ఏసీబీ కోర్ట్ పొడిగించింది.

ఈ కేసును విచారిస్తున్న జడ్జి నేడు సెలవులో ఉండడంతో ఇన్ ఛార్జ్ గా వచ్చిన న్యాయమూర్తి… బాబు దాఖలు చేసిన బెయిల్, సిఐడి వేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్