Sunday, January 19, 2025
Homeసినిమాబన్నీ కోసం సూరి స్టోరీ

బన్నీ కోసం సూరి స్టోరీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని 2023 చివర్లో కానీ.. 2024 సమ్మర్ లో కానీ విడుదల చేయనున్నారని సమాచారం. పుష్ప 2 చిత్రం ఖచ్చితంగా భారీ విజయం సాధించడం ఖాయమనే టాక్ బలంగా ఉంది. అయితే.. పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. పుష్ప 1తో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ మేకర్స్ బన్నీతో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపించారు కానీ.. ఎవరికీ ఓకే చెప్పలేదు.

బన్నీతో సినిమా చేసేందుకు మురుగుదాస్, బోయపాటి శ్రీను, విక్రమ్ కే కుమార్, అట్లీ… ఇలా పెద్ద లిస్టే ఉంది. అయితే.. ఇదంతా పుష్ప 1 రిలీజ్ కాక ముందు సంగతి. ఇప్పుడు పుష్ప 1 తో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఈ లిస్ట్ లో చేరారు. సంజయ్ లీలా భన్సాలీ కూడా బన్నీతో వర్క్ చేయాలి అనుకుంటున్నారు. తాజాగా స్టైలీష్ డైరెక్టర్ పేరు కూడా ఈ లిస్ట్ లో చేరింది. ఇంతకీ ఎవరంటారా..? సురేందర్ రెడ్డి. అల్లు అర్జున్ తో సురేందర్ రెడ్డి రేసుగుర్రం సినిమా తెరకెక్కించడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ మూవీ చేస్తున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏజెంట్ విడుదల అవ్వబోతుంది. మొదట అనుకున్నదాని ప్రకారం ఏజెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ తో రామ్ తాళ్లూరి నిర్మాణంలో సూరి సినిమా చేయాల్సి ఉంది కానీ పవన్ వరుస కమిట్మెంట్స్ కారణంగా ఆ సినిమా ఆలస్యం అయ్యేలా ఉంది. ఏజెంట్ సినిమా తర్వాత బన్నీతో సురేందర్ రెడ్డి సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే అనే ప్రచారం జరుగుతోంది. రేసుగుర్రం వంటి మంచి కమర్షియల్ సబ్జెక్ట్ ను ఇప్పటికే రెడీ చేశారని.. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే.. ప్రచారంలో ఉన్న వార్త నిజమేనా కాదా అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్