మహారాష్ట్రలో భారీ వర్షాలకు కురుస్తున్నాయి. ప్రాణహిత నదికి వరద నీరు పోటెత్తుతున్నది. దీంతో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి పెరిగింది. పుష్కరఘాట్లను వరద నీరు ముంచెత్తింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 12.9 మీటర్లకు చేరింది. అలాగే మేడిగడ్డ బ్యారేజ్‌కు ఇన్‌ఫ్లో 11.37లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 85గేట్లను ఎత్తివేసి అంతే మొత్తం అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 35,861 క్యూసెక్కులు ఉండగా.. బరాజ్ 66గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
Also Read : కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయి వరద