Sunday, January 19, 2025
Homeసినిమా'కంగువ'తో ఆసక్తిని రేపుతున్న సూర్య!

‘కంగువ’తో ఆసక్తిని రేపుతున్న సూర్య!

కోలీవుడ్ లో కొత్త కథలకు .. కొత్తదనం ఉన్న పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే హీరోల్లో, కమల్ .. విక్రమ్ తరువాత స్థానంలో సూర్య కనిపిస్తాడు. వైవిధ్యభరితమైన పాత్రలను చేసుకుంటూ వెళుతున్నాడు. బయట బ్యానర్లలో కాకుండా తన సొంత బ్యానర్లో ప్రయోగాలు చేస్తూ వెళుతున్నాడు. అలా ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలు సక్సెస్ కావడమే కాకుండా ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ సారి కూడా ఆయన ఒక విభిన్నమైన పాత్రనే తన భుజాలకెత్తుకున్నాడు. ఆ సినిమానే ‘కంగువ’.

శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి వస్తున్న పోస్టర్లు ఆయన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సూర్య లుక్ .. గుర్రంపై ఆయన యుద్ధవీరుడిలా కనిపించడం .. ఆయన భుజంపై ‘డేగ’ .. ఆయన గుర్రాన్ని ఫాలో అవుతూ కనిపించే ‘కుక్క’ ఇవన్నీ కూడా ఆయన పాత్రను ఎంత డిఫరెంట్ గా డిజైన్ చేశారనేది చెబుతున్నాయి. ఇలా టైటిల్ ను డిజైన్ చేసిన తీరు దగ్గర నుంచి ప్రతి ఒక్కటీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు.

ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరో విషయం ఏమిటంటే .. ఇది పునర్జన్మల నేపథ్యంతో ముడిపడిన కథ అని అంటున్నారు. కేవలం యుద్ధ వీరుడిగానే కాకుండా సూర్య మరికొన్ని లుక్స్ తోను కనిపించనున్నాడని చెబుతున్నారు. మొత్తానికి అన్ని వైపులా నుంచి ఈ సినిమా భారీగా ఉండేలా ప్లాన్ చేసినట్టుగానే అనిపిస్తోంది. సూర్య కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో కూడిన సినిమా ఇదేనని చెబుతున్నారు. విడుదల తరువాత ఈ సినిమా కొత్త రికార్డులను సెట్ చేస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్