టీమిండియా టి20 సారథ్య బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు బీసీసీఐ అప్పగించింది. ఇటీవల టి20 వరల్డ్ కప్ విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో శ్రీలంకలో పర్యటించే టీమిండియా టి20, వన్డేలకు వేర్వేరు కెప్టెన్లను నియమించారు. రోహిత్ శర్మ వన్డే జట్టు కెప్టెన్ గా కొనసాగుతాడు. గతంలో టీమిండియా తరఫున పలు సిరీస్ లకు టి 20 కెప్టెన్ వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను ఈసారి పక్కన పెట్టి సూర్య కుమార్ యాదవ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ టూర్ తోనే కొత్త చీఫ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం కూడా మొదలుకానుంది.
శ్రీలంకలో పర్యటించే భారత జట్టు మూడు టి20లు 3 వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈనెల 27,28,30 తేదీల్లో టి 20 మ్యాచ్ లు పల్లెకేలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా… ఆగస్ట్ 2, 4,7 తేదీల్లో కొలంబోలోని ఆర్ ప్రేమదాస ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి.
టి20 జట్టు విషయానికి వస్తే…
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజూ శామ్సన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్, అహ్మద్ ఖలీల్. సిరాజ్
వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్