Sunday, September 8, 2024
HomeTrending NewsSuryapeta: నేడు సూర్యాపేటకు ముఖ్యమంత్రి కెసిఆర్

Suryapeta: నేడు సూర్యాపేటకు ముఖ్యమంత్రి కెసిఆర్

సూర్యాపేట లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం సూర్యాపేట నియోజకవర్గంతో పాటు యావత్ జిల్లా ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సిఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న పార్టీ కార్యాలయం , మెడికల్ కాలేజ్, కలెక్టరేట్, సభా స్థలి ఏర్పాట్లను పరిశీలించారు..

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఉద్యమ సమయం లో సూర్యాపేట లో ప్రజలను ఉవ్వెత్తున చైతన్య పరిచిన సమరభేరీ సభ ను మించి ఈ రోజు (20 న) జరుగనున్న ప్రగతి నివేదన సభ జరుగ బోతుందని పేర్కొన్నారు. రెండు లక్షల మంది తో జరుగబోయే సభ వర్షం కురిసినా ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తునట్ల్లు మంత్రి తెలిపారు. సభా స్థలి వద్దకు నేరుగా చేరుకునే విధంగా పార్కింగ్ వసతులు కల్పిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

తమ బ్రతుకులను ఆగం చేసే పార్టీలు మాకు వద్దంటూ కేసీఆర్ మద్దతుగా తీర్మానాలు చేస్తూ సభకు స్వచ్ఛందంగా తరలిరావడానికి ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ను సిద్ధం చేసుకున్నారు. లక్ష రూపాయల రుణమాఫీ తర్వాత సీఎం కేసీఆర్ పాల్గొంటున్న తొలి బహిరంగ సభ సూర్యాపేట నే. 2014 ముందు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో భాగంగా సూర్యాపేటలో జిల్లా చేసిన కేసీఆర్ ఆ తర్వాత మెడికల్ కాలేజ్, కలెక్టరేట్, నూతన ఎస్పీ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి అభివృద్ధి పనులను తేవడంతో పాటు కాలేశ్వరం జలాలు తెచ్చి సూర్యాపేట ను అగ్ర భాగాన ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నరని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్