Saturday, January 18, 2025
Homeసినిమా‘సూర్యాపేట్ జంక్షన్’ షూటింగ్ పూర్తి

‘సూర్యాపేట్ జంక్షన్’ షూటింగ్ పూర్తి

‘కొత్తగా మా ప్రయాణం’ ఫేమ్ ఈశ్వర్ హీరోగా, నైనా సర్వర్ హీరోయిన్ గా ‘కథనం’ ఫేమ్ నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న మాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘సూర్యాపేట జంక్షన్’. యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.ఎస్ రావు, విష్ణువర్ధన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాజీవ్ సాలూరు, గౌర హరిలు మ్యూజిక్ అందిస్తున్నారు. హైదరాబాద్ సూర్యపేట, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

హీరో ఈశ్వర్ మాట్లాడుతూ “నేను చేసిన “కొత్తగా మా ప్రయాణం” చిత్రం సక్సెస్ అవ్వడంతో టాలీవుడ్ లో నేను నిలదొక్కుకుంటాననే  నమ్మకం పెరిగింది.  కోవిడ్ తర్వాత నేను రాసుకున్న సబ్జెక్ట్ సూర్యాపేట్ జంక్షన్. అప్పటికే “కథనం”  పేరు తెచ్చుకున్న దర్శకుడు నాదెళ్ల రాజేష్ కి “సూర్యాపేట్ జంక్షన్” స్టోరీ చెప్పడం జరిగింది. ఆయనకి కథ నచ్చడంతో ఈ స్టోరీ మీద రెండు సంవత్సరాల నుండి ఆయ‌న‌తో కలసి డెవలప్ చేశాను. ఆతర్వాత నిర్మాతలు వెంటనే ఒప్పుకోవడంతో లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేశాం. హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ చేశాం. మొయినాబాద్ లో ఒక ఐటమ్ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్ వేసి చాలా రిచ్ గా సాంగ్ ను చిత్రీకరించాం. ఈ సాంగ్ తో షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తి అయ్యింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. వారం రోజుల్లో ఐటమ్ సాంగ్ రిలీజ్ తో పాటు మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్