Sunday, January 19, 2025
Homeసినిమా'భోళా శంకర్' ప్రత్యేక పాత్రలో సుశాంత్

‘భోళా శంకర్’ ప్రత్యేక పాత్రలో సుశాంత్

చిరంజీవి, మెహర్ రమేష్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘భోళా శంకర్’. ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన , లవర్ బాయ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. సుశాంత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు.

సుశాంత్ లీడ్ రోల్స్ తో పాటు ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలని ఎంపిక చేసుకుంటున్నారు. భోళా శంకర్‌లో అతని పాత్ర చాలా కీలకంగా వుంటుంది. పోస్టర్‌లో సూట్‌లో లైట్ గడ్డంతో ఛార్మింగా కనిపిస్తున్నాడు.మహా శివరాత్రి సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన మోషన్ పోస్టర్‌ చిరంజీవిని ఫెరోషియస్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. మిగతా ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్