Tuesday, January 21, 2025
HomeTrending Newsవైభవంగా ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం

వైభవంగా ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం జరిగింది. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహారథులతో రాష్ట్రపతి భవన్ పరిసరాలు సందడిగా మారాయి.

ఆదివారం రాత్రి 7.05 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేపాల్, భూటాన్, మాల్దీవులు, సెషెల్స్, శ్రీలంక, మారిషసస్ దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని ప్రముఖులతోపాటు పలువురు విదేశీ ప్రముఖులు ఢిల్లీకి విచ్చేశారు.

బీజేపీ నుంచి రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, జై శంకర్‌, నిర్మలా సీతారామన్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, జేపీ నడ్డా, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, సర్వానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, ప్రహ్లాద్‌ జోషి, జుయెల్‌ ఓరం, గిరిరాజ్ సింగ్, అశ్వనీ వైష్ణవ్‌, జ్యోతిరాదిత్య సింథియా, భూపేంద్ర యాదవ్‌, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణ దేవి, కిరణ్‌ రిజిజు, హర్దీప్‌సింగ్‌ పురి, మన్‌సుఖ్‌ మాండవీయ, సీఆర్‌ పాటిల్‌, కిషన్ రెడ్డి, రామ్లుమోహన్ నాయుడు(టిడిపి), హెచ్‌డీ కుమార స్వామి (జేడీఎస్‌), చిరాగ్‌ పాశ్వాన్ (ఎల్‌జేపీ)‌‌, రాజీవ్ రంజన్ సింగ్(లలన్‌సింగ్‌)(జేడీయూ)‌, జితన్‌ రామ్‌ మాంఝీ (హెచ్‌ఏఎమ్‌)లు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

వారితోపాటే కేంద్రమంత్రులు(స్వతంత్ర)గా అర్జున్‌ రాం మేఘవాల్‌, రావు ఇంద్రజీత్‌ సింగ్‌, జితేంద్ర సింగ్, ప్రతాప్ రావు గణపత్ రావు జాదవ్(శివసేన – శిండే),

సహాయ మంత్రులుగా జతిన్ ప్రసాద్,  శ్రిపాద్ యశో నాయక్, జయంత్‌ చౌధరి (ఆర్‌ఎల్డీ), రామ్‌దాస్‌ అథవాలె (రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), పంకజ్ చౌదరి, క్రిషన్ పాల్, రామ్‌నాథ్‌ ఠాకూర్ (జేడీయూ)‌, నిత్యానంద్ రాయ్, అనుప్రియా పటేల్‌(అప్నా దళ్), వి సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్, ప్రొఫెసర్ ఎస్పి సింగ్ భాగెల్, శోభా కరాంద్లజె, కీర్తి వర్ధన్ సింగ్, బిఎల్ వర్మ, శంతను ఠాకూర్, సురేష్ గోపి, ఎల్‌ మురుగన్‌, అజయ్ తంటా, బండి సంజయ్, కమలేశ్ పాశ్వాన్, భగీరధ్ చౌదరి, సతీష్ చంద్ర దూబే, సంజయ్ సేథ్, రవనీత్ సింగ్ బిట్టు, దుర్గాదాస్ వికె, రక్షా నిఖిల్ ఖడ్సే, సుకాంత మజుందార్, సావిత్రి ఠాకూర్, తపన్ సాహు, రాజ్ భూషణ్ చౌదరి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, హర్ష్ మల్హోత్రా, నిముబెన్‌ బంబానియా, మురళీధర్ మోహోల్, జార్జ్ కురియన్, పబిత్ర మార్గరీట ప్రమాణ స్వీకారం చేశారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఏకంగా ఐదుగురికి మంత్రివర్గంలో ఛాన్స్‌ దక్కింది. ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, బీజేపీ నుంచి శ్రీనివాస వర్మకు మంత్రులుగా అవకాశం వచ్చింది. తెలంగాణలో బీజేపీ నుంచి గెలుపొందిన కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ లు ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చేరారు.

ఈ క్రమంలోనే లోక్‌సభ స్పీకర్‌ పదవిపై ఆసక్తికరమైన ప్రచారం మొదలయ్యింది. ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరికి స్పీకర్‌ పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్