Magdalena Anderson Resigns :
స్వీడన్ ప్రధానమంత్రి మగ్దలేన ఆండర్సన్ తన పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటులో సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వీగిపోవటంతో ఆండర్సన్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. స్వీడన్ మొదటి మహిళా ప్రధానమంత్రిగా పేరొందిన అండర్సన్ నేతృత్వంలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ మైనారిటీ ప్రభుత్వానికి గ్రీన్ పార్టీ మద్దతు ఇస్తోంది. బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వానికి గ్రీన్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవటంతో గంటల వ్యవధిలోనే మగ్దలేన ఆండర్సన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.
సోషల్ డెమోక్రాట్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో గ్రీన్ పార్టీ భాగస్వామిగా ఉండగా సెంటర్ పార్టీ, లెఫ్ట్ పార్టీ బయట నుంచి మద్దతు ఇస్తున్నాయి. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆండర్సన్ సంకీర్ణ ప్రభుత్వం కాకుండా తమ పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీ సాధిస్తేనే ప్రభుత్వంలో కొనసాగటం ఉత్తమమని, అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశాపీటిన ఆర్ధిక బిల్లులో పన్నులు తగ్గించటం, పోలీసు అధికారులకు జీత భత్యాలు పెంచటం, న్యాయశాఖ పలోపెతానికి నిధుల కేటాయింపు సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలకు దారితీసింది.
అండర్సన్ రాజీనామా నేపథ్యంలో దేశంలోని ప్రధానమైన ఎనిమిది పార్టీలతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పార్లమెంటు స్పీకర్ ప్రకటించారు. రాబోయే సెప్టెంబర్ 11 వ తేదిన స్వీడన్ ఎన్నికలు ఉండటం, అండర్సన్ రాజీనామా చర్చనీయంశంగా మారింది. ఎన్నికలు మరో పది నెలలు ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.
Also Read : యుకెలో 45 వేల కేసులు