ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్ గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సయీద్ అబ్దుల్ నజీర్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. కొద్ది సేపటి క్రితం రాష్ట్రపతి భవన్ ప్రెస్ సెక్రటరీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఏపీ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ను ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా పంపారు.
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి తో పటు లధఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథూర్ ల రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి, ఈ రెందిటి తో పాటు పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్ లను నియమించారు.
ఈఎస్ఎల్ నరసింహన్ అనంతరం 2019 జూలై 17న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండో గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. ఆయన జూలై 24న పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఇక నూతన గవర్నర్ సయీద్ అబ్దుల్ నజీర్ 1958 జనవరి 5 న కర్నాటక రాష్ట్రం, బెలువాయి లో జన్మించారు. 17 ఫిబ్రవరి 2017 న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఈ ఏడాది జనవరి 5 వరకూ కొనసాగారు. పదవీ విరమణ చేసిన నలభై రోజుల్లోపే ఆయన్ను గవర్నర్ వదవి వరించడం గమనార్హం.
అత్యంత కీలకమైన అయోధ్య, ట్రిపుల్ తలాక్ అంశాలను విచారించిన సుప్రికోర్టు బెంచ్ లో నజీర్ కూడా ఉన్నారు.