Sunday, November 24, 2024
HomeTrending Newsఆఫ్ఘన్లో హిందువులు, సిక్కులకు రక్షణగా తాలిబాన్లు

ఆఫ్ఘన్లో హిందువులు, సిక్కులకు రక్షణగా తాలిబాన్లు

ఆఫ్ఘనిస్తాన్ వీడిన హిందువులు,సిక్కులు తిరిగి స్వదేశానికి రావాలని తాలిబన్లు విజ్ఞప్తి చేశారు. హిందువులు, సిక్కుల రక్షణకు అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని, భద్రతా పరంగా తాము బాధ్యత స్వీకరిస్తామని తాలిబన్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తాలిబాన్ మంత్రి ముల్లా అబ్దుల్ వాసి హిందూ, సిక్కు మత పెద్దలతో కాబుల్ లో సోమవారం సమావేశమయ్యారు. మైనారిటీల రక్షణ ప్రభుత్వ బాధ్యతని… ఇక నుంచి ఎవరికీ ప్రాణ హాని ఉండదని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు.

కాబుల్ లో గత నెల 18వ తేదిన ఇస్లామిక్ స్టేట్ ఖోరసాన్ ప్రావిన్స్ జరిపిన దాడిలో గురుద్వారా రక్తసిక్తమైంది. దాడుల్లో కొందరు సిక్కులు చనిపోగా అనేకమంది గాయపడ్డారు. ఆ ఘటన జరిగిన తర్వాత సిక్కులు, హిందువులు పెద్ద సంఖ్యలో భారత్ కు వలస వెళుతున్నారు. దీంతో తాలిబన్లకు అంతర్జాతీయంగా అపప్రత ఎదురవుతోంది. తాలిబాన్ల తీరులో మార్పులేదని… వారు కరడుగట్టిన మతోన్మాడులని ఆరోపించే వారి మాటలకు బలం చేకురుతోంది. ఇదే జరిగితే అంతర్జాతీయంగా సాయం అందటం కష్టం. ముఖ్యంగా ఎలాంటి విపత్తు వచ్చిన కొద్ది రోజులుగా భారత్ ముందుగా సాయం చేస్తోంది.

ఈ నేపథ్యంలో కాబుల్ లోని గురుద్వారా కర్తే పరివాన్ పునర్ నిర్మాణానికి తాలిబన్లు ముందుకు వచ్చారు.  మైనారిటీల రక్షణ, ఉగ్రవాద మూకల కట్టడి కోసం తాలిబన్లు కటిన చర్యలకు ఉపక్రమించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఇటీవల జరిపిన దాడుల్లో తాలిబన్లు నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Readసున్నీల రక్త దాహానికి అమాయకుల బలి  

RELATED ARTICLES

Most Popular

న్యూస్