Saturday, January 18, 2025
HomeTrending Newsతాలిబన్లు దేశభక్తులు – ఎస్పి ఎంపి

తాలిబన్లు దేశభక్తులు – ఎస్పి ఎంపి

ఆఫ్ఘనిస్తాన్లో పరిణామాలపై సమాజ్ వాది పార్టీ ఎంపి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని సంభల్ నుంచి లోక్ సభ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షఫీకుర్ రెహమాన్ బర్క్ తాలిబాన్ల పోరాటాన్ని స్వాతంత్రోద్యమంతో పోల్చారు. ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యం కోసం తాలిబన్లు పోరాడుతున్నారని ఎస్పి ఎంపి అభివర్ణించారు. ఆఫ్ఘన్ ప్రజలు కోరుకుంటున్న స్వేఛ్చ, స్వాతంత్ర్యాన్ని తాలిబన్లు సాధిస్తున్నారని ప్రశంసించారు.

ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కోసం భారతీయులు పోరాడినట్టే తాలిబన్లు పోరాడుతున్నారన్నారు. ఇందులో భాగంగా అమెరికా, రష్యా లాంటి బలమైన దేశాల్ని కూడా తమ భూభాగంలో ఉండకూడదని దశాబ్దాలుగా పోరాడున్నారని రెహ్మాన్ వివరించారు. ఆఫ్ఘన్లో పరిణామాలు, తాలిబాన్ల పోరాటం వారి అంతర్గత వ్యవహారం అందులో అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటోందని సమాజ్ వాది ఎంపి రెహమాన్ ప్రశ్నించారు.

రహ్మాన్ వ్యాఖ్యలతో సమాజ్ వాది పార్టీ ఇరకాటంలో పడింది. తాలిబాన్ ఉగ్రవాదుల్ని సమర్థించిన రెహమాన్ దేశద్రోహి అంటూ సోషల్ మీడియా నెటిజన్లు  ట్రోల్ చేస్తున్నారు. రెహమాన్ వ్యాఖ్యలపై బిజెపి ఘాటైన ఆరోపణలు చేసింది. సమాజ్ వాది పార్టీ కి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు పెద్ద తేడా లేదని బిజెపి ఎంపి కేపి మౌర్య విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్