ప్రభాస్.. తన తోటి నటీనటులను ఎంత బాగా చూసుకుంటాడో.. ఎలాంటి మర్యాదలు చేస్తాడో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా షూటింగ్ జరుగుతున్న టైమ్ లో తనతో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల కోసం ఇంటి నుంచే క్యారేజీ తెప్పిస్తుంటాడు. రకరకాల వంటకాలతో వావ్ అనిపించేలా ఫుడ్ తీసుకువస్తుంటాడు. అమితాబ్, దీపికా పడుకునే, శృతిహాసన్, శ్రద్ధాకపూర్, కృతి సనన్, సూర్య, సైఫ్ ఆలీఖాన్, భాగ్యశ్రీ, డైరెక్టర్ లారెన్స్.. ఇలా చాలా మంది ప్రభాస్ ఆతిథ్యాన్ని స్వీకరించినవాళ్లే. వీళ్ల లిస్ట్ లోకి తమన్నా చేరింది. ప్రభాస్ తో తమన్నా ‘రెబల్’, ‘బాహుబలి’ చిత్రాల్లో నటించింది.
ఇటీవల తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ ఆతిథ్యం గురించి పొగడ్తల వర్షం కురిపించింది. గతంలో ప్రభాస్ తో వర్క్ చేసిన చాలా మంది ఆయన షూటింగ్ సందర్భంగా వ్యవహరించే తీరు మరియు ఆయన ఇంటి నుండి వచ్చే లంచ్ మరియు డిన్నర్ బాక్స్ ల గురించి మాట్లాడటం జరిగింది. తమన్నా కూడా అదే తరహా లో మాట్లాడి ఆ జాబితాలో చేరిపోయింది. ఇంతకీ తమన్నా ప్రభాస్ గురించి ఏం చెప్పిందంటే… ప్రభాస్ తన ఇంటికి వచ్చిన అతిథులను ఎలా చూసుకుంటాడో అందరికీ తెలుసు. ఆయన భోజనంకు ఆహ్వానిస్తే 30 రకాల వంటకాలను తయారు చేయిస్తాడు. డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి ప్రభాస్ కానే కాదు. రాజు అనేవాడు ఉంటే ఇలాగే ఉంటాడేమో అనిపించే విధంగా ప్రభాస్ తన మంచితనంతో అతిథి మర్యాదలతో బాబోయ్ అనిపిస్తాడని తమన్నా చెప్పింది.
తనకు అంత స్టార్ డమ్ ఉన్నా.. అభిమానులు ఉన్నా కూడా చాలా సింపుల్ గా అందరితో కలిసి పోతుంటాడు. అలా చాలా తక్కువ మంది ఉంటారు. ప్రభాస్ కు మాత్రమే అలా సాధ్యం. ఆయన సింప్లిసిటీ అందరికి నచ్చతుంది అంటూ తమన్నా ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేసింది. ఆయన ఆతిథ్యం పొందాలని కూడా చాలా మంది ప్రభాస్ తో వర్క్ చేయాలని కోరుకుంటూ ఉంటారు అంటూ ఇండస్ట్రీ లో టాక్ ఉంది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’, ‘సలార్’ చిత్రాలు ఈ సంవత్సరంలో విడుదల కానున్నాయి. మరి.. ఈ రెండు చిత్రాలతో ప్రభాస్ సరికొత్త రికార్డులు సెట్ చేస్తాడేమో చూడాలి
Also Read: ప్రభాస్ ఆ ఛాన్స్ ఇచ్చేది ఎవరికి..?