Sunday, January 19, 2025
Homeసినిమాతమిళ హీరో, డిఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి

తమిళ హీరో, డిఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి

తమిళ అగ్రనటుడు, డిఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ అనారోగ్యంతో కన్నుమూశారు, ఆయన వయసు 71 సంవత్సరాలు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్ చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళారు. నిన్న ఆయనకు కరోనా సోకడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు మియాట్ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్ పై చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన మృతి చెందారు. విజయ్ కాంత్ మృతిని తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ధ్రువీకరించారు.

2005 సెప్టెంబరు 14న డి.ఎం.డి.కె పార్టీని నెలకొల్పిన విజయ్ కాంత్ ఆ మరుసటి ఏడాది 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెల్చుకున్నారు. విరుదాచలం నియోజకవర్గం నుంచి ఆయన ఒక్కరే విజయం సాధించారు. 2011 ఎన్నికల్లో జయలలిత పార్టీ ఎఐఎడిఎంకెతో పొత్తు పెట్టుకుని 41 నియోజకవర్గాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో విజయం సాధించారు. ఈసారి రిశివాండియం నుంచి పోటీచేసి విజయ దుందుభి మోగించారు. కరుణానిధి  సారధ్యంలోని డిఎంకె  కంటే ఎక్కువ స్థానాలు గెల్చుకోవడంతో డిఎండికె అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ గుర్తింపు సాధించింది.

కెప్టెన్ ప్రభాకర్, సిటీ పోలీస్ సినిమాల ద్వారా తెలుగులో కూడా ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్