ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, సాగునీరు, మిషన్ కాకతీయ, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల పథకాలతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని నిరంజన్ రెడ్డి అన్నారు. విత్తనాల కోసం లైన్లలో నిలబడి, ఎరువుల కోసం లాఠీదెబ్బలు తిన్న గత పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేవని, ప్రభుత్వ చర్యల మూలంగా ఎనిమిదేళ్లలో తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో, పత్తి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. రైతుబంధు, మిషన్ కాకతీయ తదితర తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశమంతా అమలు జరగాలని భారత రైతాంగం డిమాండ్ చేస్తున్నదని, దేశంలో కేసీఆర్ గురించి, తెలంగాణ పథకాల గురించి మాట్లాడుకోవడం మొదలయిందన్నారు.
కేంద్రంలో రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అబ్ కి బార్ .. కిసాన్ సర్కార్ నినాదంతో బీజేపీకి చెమటలు పడుతున్నాయన్నారు. అందుకే తెలంగాణ అభివృద్దికి అడ్డుపడుతూ కుట్రలు చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.