Monday, January 20, 2025
HomeTrending Newsఒంటరిగానే పోటీ: తరుణ్ చుగ్

ఒంటరిగానే పోటీ: తరుణ్ చుగ్

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎలాంటి పొత్తులు అవసరం లేకుండానే బిఆర్ఎస్ ను ఓడిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు, షర్మిల పార్టీకి కూడా అండగా ఉంటామని తాను చెప్పినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

పొత్తులపై ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని ఆయన సూచించారు. టిడిపి, షర్మిల పార్టీలపై అసలు తాను మాట్లాడనే లేదని వివరణ ఇచ్చారు. తాము ఎవరి అవసరం లేకుండానే అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.  ఈ ప్రచారం వెనుక బిఆర్ ఎస్ నేతలు ఉన్నారని ఆయన అనుమానం వెలిబుచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్