Taslima Nasreen Once Again Had A Bad Experience With Facebook :
ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ ఫేస్ బుక్ అకౌంట్ వారం రోజులు బ్యాన్ చేస్తూ ఫేస్ బుక్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ అకౌంట్ వారం రోజులు బంద్ చేయటంపై బంగ్లాదేశ్ కు చెందిన తస్లీమా నస్రీన్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో ఇటీవల హిందువుల ఇళ్ళపై, మందిరాలపై దాడులు, హిందూ దేవుళ్ళను కించపరిచే చర్యల్ని విమర్శిస్తూ తస్లిమ నస్రీన్ ఫేస్బుక్ లో పోస్టు పెట్టారు. హనుమంతుని విగ్రహం దగ్గర ఖురాన్ పెట్టడం అవాంచనీయమని అందుకు కారణమైన వారిని శిక్షించాలని తస్లిమే ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇతర మతాల వారిపై దాడులు, అవమానించటంపై ముస్లీం మత సంస్థలు స్పందించక పోవటం దారుణమన్నారు.
ఇదే ఏడాది మార్చి 16 వ తేదిన 24 గంటలు బ్యాన్ పెట్టిన ఫేస్ బుక్ యాజమాన్యం ఈ దఫా ఏకంగా వారం రోజుల బ్యాన్ పెట్టింది. ఫేస్ బుక్ యాజమాన్యం చర్య శోచనీయమని, నిజం మాట్లాడకుండా నిరోధిస్తున్నారని ట్విట్టర్ వేదికగా తస్లిమా నిరసన తెలిపారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలు తెలిపేందుకు అవకాశం లేకుండా చేయటం వ్యక్తిగత స్వేఛ్చ హరించటం సరికాదన్నారు.
బంగ్లాదేశ్ లో పేరొందిన ఆరోంగ్ సంస్థలో ఓ ఉద్యోగి గడ్డం తీసుకుని విధులకు హాజారు కావాలని సంస్థ యాజమాన్యం ఆదేశించగా సదరు ఉద్యోగి అందుకు నిరాకరించాడు. ఆ ఉద్యోగిని ఆరోంగ్ సంస్థ విధుల నుంచి తొలగించటంతో అప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆరోంగ్ సంస్థ ఉత్పత్తుల్ని బహిష్కరించాలని ముస్లీం మత సంస్థలు పిలుపు ఇచ్చాయి. ఆరోంగ్ సంస్థకు ఫేస్బుక్ వేదికగా తస్లీం నస్రీన్ మద్దతు తెలిపారు. దీంతో మార్చి నెలలో 24 గంటల పాటు తస్లిమా ఫేసు బుక్ అకౌంట్ నిలిపివేశారు.
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులను వివరిస్తూ తస్లిమా నస్రీన్ 1993 లో లజ్జ పుస్తకం రాశారు. అప్పుడు తస్లిమాకు వ్యతిరేకంగా ముస్లీం సంస్థలు ఫత్వా జారీ చేయటం, బంగ్లాదేశ్ లో ఆ పుస్తకం నిషేధించటంతో తస్లిమా అప్పటి నుంచి భారత్ లోనే శరణార్తిగా ఉంటున్నారు. అది జరిగిన నాటి నుంచి తస్లిమా కలకత్తా, ఢిల్లీ నగరాల్లో నివాసం ఉంటున్నారు.
Must Read :బంగ్లాదేశ్ లో లూటీలు, గృహ దహనాలు