Sunday, April 20, 2025
HomeTrending Newsరేపటి గుడివాడ మహానాడు వాయిదా

రేపటి గుడివాడ మహానాడు వాయిదా

Postponed: తెలుగుదేశం పార్టీ రేపు  గుడివాడ లో నిర్వహించ తలపెట్టిన జిల్లా స్థాయి మహానాడు కార్యక్రమం వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం, వాతావరణం అనుకూలoగా లేనందున కార్యక్రమం వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు టిడిపి కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో బాబు భేటీ అయి గుడివాడ లో రేపటి మహానాడు నిర్వహణపై సమీక్ష జరిపారు.

వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా గుడివాడ మహానాడు తదుపరి తేదీ ఖరారు చేయాలని నేతలను ఆదేశించిన బాబు,  గుడివాడ మహానాడు నిర్వహించుకున్న తర్వాతే పార్టీ తరఫున మరో కార్యక్రమం చేపడదామని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్