మూడేళ్ళలో సిఎం జగన్ ఉద్యోగాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీలో నిరుద్యోగ అంశంపై చర్చకు టిడిపి సభ్యులు పట్టుబడ్డటం విడ్డూరంగా ఉందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, నిరుద్యోగ భ్రుతి హామీ ఇచ్చి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. నిరుద్యోగ సమస్యపై మాట్లాడే అర్హత టిడిపికి లేదన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆమె సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
దేశంలో మరే ప్రభుత్వం ఇవ్వలేనన్ని ఉద్యోగాలు యువతకు కల్పించి సిఎం జగన్ చరిత్ర సృష్టించారని రోజా తెలిపారు. లక్ష్హా 21వేల మందిని సచివాలయ ఉద్యోగులుగా నియమించారన్నారు. రెండున్నర లక్షల మందిని వాలంటీర్లుగా నియమించి వారి ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల వద్దకే అందిస్తున్నారని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖలో 42 వేల పోస్టులు, విద్యా శాఖలో 4,758 పోస్టులు భర్తీ చేశారని రోజా చెప్పారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయాలే ముఖ్యమని, ప్రజా సమస్యలపై చర్చించే చిత్తశుద్ది వారికి లేదని విమర్శించారు.
Also Read: శాసన సభ, మండలి సమావేశాలకు పటిష్ట భద్రత