Sunday, January 19, 2025
HomeTrending Newsపోలీసులపై విమర్శలా? : వనిత ఆగ్రహం

పోలీసులపై విమర్శలా? : వనిత ఆగ్రహం

Be fair: అమలాపురం ఘటనలో జనసేన, తెలుగుదేశం పార్టీల హస్తం ఉందని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి తానేటి వనిత పునరుద్ఘాటించారు. బాధితుల పరామర్శకు పవన్ కళ్యాణ్ వెళితే… మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ లను కూడా పరామర్శిస్తారని అనుకుంటునట్లు చెప్పారు. ప్రభుత్వంపై, తనపై నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.  రాళ్ళ దాడులు ఎదుర్కొన్నా కూడా ప్రజల ప్రాణాలు ఎలాంటి ముప్పు కలగకుండా పోలీసులు సంయమనం పాటించారని, అలాంటి పోలీసులను అభినందించాల్సింది పోయి వారిపై విమర్శలు చేయడం టిడిపి, జనసేన నేతలకు తగదని వనిత వ్యాఖ్యానించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలో వద్దో తమ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అమలాపురం ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ 70 మందిని అదుపులోకి తీసుకున్నామని, సమగ్ర విచారణ జరుగుతోందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని  హోమ్ మంత్రి చెప్పారు.  కోనసీమ ఉద్యమం ఊహించలేదని, అంబేద్కర్ పేరు పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని జనసేన నేతలు కూడా ఆందోళనలు చేశారని ఆమె వెల్లడించారు, అంబేద్కర్ పేరు కోసం దీక్షలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినవారు ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు,

Also Read : అమలాపురం ఘటన దురదృష్టకరం: శ్రీకాంత్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్