Sunday, January 19, 2025
HomeTrending Newsఅక్వాపై ప్రశ్నిస్తే అరెస్టులా?: అచ్చెన్న

అక్వాపై ప్రశ్నిస్తే అరెస్టులా?: అచ్చెన్న

సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రశ్నించిన టీడీపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినందుకు తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తక్షణమే అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

“పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, వెంకట శివరామరాజు, పత్తిపాటి పుల్లారావుతో పాటు మరో 400 మందిపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆక్వాకు మద్దతు ధరపై మంత్రుల కమిటీ మొదట నిర్ణయించిన రూ.240 నుంచి తమ లూటీ కోసం రూ.210కి కుదించడం జగన్ రెడ్డి అసమర్థతకు నిదర్శనం. ఆక్వా రైతుల సమస్యలపై శాంతియుతంగా పోరాటం చేసిన టీడీపీ నేతలను అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేయడం అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనం. చంద్రబాబు గారి హయాంలో దేశంలోనే అగ్రభాగాన ఉన్న ఆక్వారంగం నేడు జగన్ రెడ్డి పాలనలో పతనావస్థకు చేరింది. మద్దతు ధర లభించక ఆక్వా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. షరతుల పేరుతో సబ్సీడీలు ఎత్తివేసి, జే ట్యాక్స్ తో ఆక్వా రైతులను దోచుకుంటున్నారు. ప్రశ్నించిన వారిని అణచివేయాలనే మీ కుట్రలు సాగబోవని హెచ్చరిస్తున్నాం” అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్