ధరల పెరుగుదలపై సభలో చర్చించాలని కోరుతూ టిడిపి సభ్యులు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. కాగా, ఈ అంశంపై టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందున ఈ అంశంపై చర్చకు ఆస్కారం లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఈ గందరగోళం మధ్యనే మంత్రులు పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు, ఈ బిల్లులు ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. ఈ దశలో టిడిపి సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. టిడిపి సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. వెంటనే టిడిపి సభ్యులను బైటికి వెళ్లాల్సిందిగా స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
టిడిపి సభ్యులు పోడియం పైకి ఎక్కి నినాదాలు చేయడంతో ఒకానొక దశలో స్పీకర్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాగా ఉందా అంటూ వారిపై మండిపడ్డారు. మార్షల్స్ ను లోనికి పిలిపించి వాటిని బైటకు తీసుకు వెళ్ళాల్సిందిగా ఆదేశించారు.
Also Read : ధరల పెరుగుదలపై టిడిపి నిరసన