Saturday, November 23, 2024
HomeTrending Newsమాట తప్పి... బెదిరిస్తారా?: అశోక్ బాబు

మాట తప్పి… బెదిరిస్తారా?: అశోక్ బాబు

ఉద్యోగస్తులను బెదిరించి, కేసులు పెట్టి సెప్టెంబర్ 1న తలపెట్టిన చలో సిఎం క్యాంప్ ఆఫీస్ కార్యక్రమాన్ని వాయిదా వేయించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘాల మాజీ నేత పి. అశోక్ బాబు ఆరోపించారు.  ప్రభుత్వాన్ని విమర్శించడం వేరు, దూషించడం వేరన్నారు. తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకుండా అధికార బలంతో ఉద్యోగులను అణచివేస్తున్నారని విమర్శించారు.  గతంలో ఎన్నో సార్లు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలపై  చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని, కానీ ఒక ఆందోళనా కార్యక్రమానికి పిలుపు ఇచ్చినప్పుడు దాన్ని ఈ స్థాయిలో అడ్డుకున్న ఘటనలు ఎప్పుడూ లేవన్నారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపారని, అదే విధంగా సీపీఎస్ రద్దుపై కూడా ఇచ్చిన హామీలను అమలు చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. చెప్పిన గడువు ముగిసి రెండున్నర ఏళ్ళు దాటినా ఇంతవరకూ ఆ హామీ నెరవేర్చలేదని, పైగా దీనిపై మంత్రి బుగ్గన, సజ్జల, ఇతర నేతలు తలా ఒక మాట చెప్పారని విమర్శించారు. ఒకవేళ నిజంగా ఇది సాధ్యం కాకపొతే అదే విషయాన్ని సిఎం స్వయంగా చెప్పాలని, ఉద్యోగ సంఘాలకు వివరించాలని, అంటే కానీ ఉద్యోగుల ఆందోళనను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. అసలు సీపీఎస్ విషయం ప్రస్తావించవద్దని జీపీఎస్ గురించే మాట్లాడదామంటూ బుగ్గన చెప్పడం సరికాదన్నారు.

ప్రస్తుతానికి ఆందోళనను అణచి వేసినా భవిష్యత్తులో ఉద్యోగుల ఆందోళనకు ఈ ప్రభుత్వం కూడా కొట్టుకుపోయే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

Also Read : ఇది కేంద్ర ప్రభుత్వం పథకం: అశోక్ బాబు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్